దశాబ్ది విద్యుత్ ప్రగతిలో టాప్
తలసరి విద్యుత్తు వినియోగంలో మనమే టాప్
* ఉచిత విద్యుత్తు కోసం ఏటా 12కోట్లు ఖర్చు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు
* వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్
* మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యుత్తు రంగం బలోపేతం కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.473.88 కోట్లు
* నిరంతర విద్యుత్తుతో వ్యవసాయం బాగుపడి రైతులకు భరోసా కల్పిస్తున్న గులాబీ అధినేత కేసీఆర్
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు కోసం ఏటా 12కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు రంగంలో సాధించిన విజయోత్సవాలపై మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సమిష్టి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన అద్భుత విజయాలను సొంతం చేసుకున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలితంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ వ్యవసాయ రంగాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.
గడిచిన తొమ్మిదేండ్లలో ఉచిత విద్యుత్తు, విద్యుత్తు రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. నిరంతర విద్యుత్తు తో వ్యవసాయం బాగుపడి రైతులకు భరోసా కల్పిస్తోందన్నారు. పరిశ్రమలు నిరంతరాయంగా నడుస్తూ యువతకు ఉపాధి లభిస్తున్నదని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యుత్ రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.473.88 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థ అభివృద్ధి కొరకు 159.06 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల ఈహెచ్టీ ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ సాధ్యమైదన్నారు.అనంతరం విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వారు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరించారు. విద్యుత్తు రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మశక్యంకాని విజయాన్ని సొంతం చేసుకున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అలుముకున్న చిమ్మచీకట్లను స్వరాష్ట్రంలో తరిమివేసి వెలుగులు నింపారని అభివర్ణించారు. దేశంలోనే మరే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు పరిశ్రమలకు ఇవ్వని విధంగా 24గంటల నిరంతరాయ విద్యుత్తును అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కుష్బూ గుప్తా, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఆర్డీవో చెన్నయ్య, ఎంపీపీలు నూకల సరళ హన్మంత్ రెడ్డి, ధీరావత్ నందిని రవితేజ, బాలాజీ నాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్, లలితా హాతీరాం నాయక్, బీఆర్ఎస్ మిర్యాలగూడ మండల అధ్యక్షుడు సైదులు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.