దశాబ్ది పారిశ్రామిక ప్రగతి

దశాబ్ది పారిశ్రామిక ప్రగతి

నేడు శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ లో వేడుకలు

గుత్తా, నలమోతు భాస్కర్ రావులు రాక

కోర్ మెంబర్స్ యూనియన్,
పిఏసిఎస్ చైర్మన్ రాములు గౌడ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని మంగళవారం పారిశ్రామిక దినోత్సవాన్ని మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ లో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆటోనగర్ కోర్ మెంబర్స్ యూనియన్ నేత, పిఏసిఎస్ చైర్మన్ జేరిపోతుల
రాములు గౌడ్ అన్నారు. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించి, ఆ సభల్లో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని వివరించనున్నట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని వివరిస్తారన్నారు.

మిర్యాలగూడ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఆసియా ఖండంలోనే అగ్రగామిగా
ఉన్న రైస్ ఇండస్ట్రీ పారిశ్రామిక వేత్తలు, కార్మికులతో పాటు ఆటోనగర్ సభ్యులను ఆటోనగర్ నందు ప్లాట్స్ పొందిన ప్రతి ఒక్క సభ్యుని ఆహ్వానించడం జరిగిందన్నారు. ఇది మన ఆటోనగర్ ప్రగతికి ఒక బాట కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లారీ మెకానిక్స్, ట్రాక్టర్ మెకానిక్స్, వర్క్ షాప్స్, ఎలక్రికల్, బాడీ బిల్డింగ్, గ్యాస్ వెల్దింగ్, టింకరింగ్, కమాని, పెయింటింగ్, టైర్ వర్క్స్ , కార్ మెకానిక్స్, రెక్సిన్, ఆటోమొబైల్ షాప్స్ అందరూ వారి వారి దగ్గర పని చేసే స్టాఫ్ మెంబెర్స్ తో సహా హాజరు కావాలని ఆయన కోరారు. పారిశ్రామిక ప్రగతి సభకు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ పారిశ్రామిక
ప్రగతి ప్రదాత, మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ ఆర్డీఓ చెన్నయ్య, TSIIC ఉన్నతాధికారులు తదితర విభాగాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారన్నారు. లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆటోనగర్ మరింత ప్రగతికి మరిన్ని సలహాలు, సూచనలు పొందే వీలుందని చెప్పారు. ఆటోనగర్ లో వివిధ ట్రేడ్ ల్లో పనిచేస్తున్న యజమానులు, కార్మికులు, ఉపాధి, ఉద్యోగులంతా హాజరై విజయ వంతం చేయాలని రాములు గౌడ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking