హైదరాబాద్ ‘సేఫ్ సిటీ’నా?

హైదరాబాద్ ‘సేఫ్ సిటీ’నా?

సైకిల్ ట్రాక్పై యువతికి దారుణ అనుభవం! వీడియో వైరల్

హైదరాబాద్ అక్షిత బ్యూరో 

దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా (సేఫ్ సిటీ) పేరున్న హైదరాబాద్లో మహిళల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని ప్రసిద్ధ సైకిల్ ట్రాక్పై ఉదయం పూట వాకింగ్/రన్నింగ్కు వెళ్లిన ఓ యువతికి అత్యంత చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన ఈ దారుణమైన ఘటనను వివరిస్తూ ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది

అసలేం జరిగిందంటే..?

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి ఉదయం 6 గంటల సమయంలో సైకిల్ ట్రాక్పై రన్నింగ్ చేస్తుండగా.. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమె ముందు అత్యంత అసభ్యకరంగా, వికృతంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనలకు గురైన ఆ యువతి తన ఫోన్లో వీడియో తీయడం స్టార్ట్ చేసింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి వీడియోలో మాట్లాడుతూ.. ‘నేను ఉదయం 6 గంటల సమయంలో రన్నింగ్ చేస్తున్నాను. 6:15 నిమిషాలకు ఒక వ్యక్తి సైకిల్ ట్రాక్ పక్కనే బహిరంగంగా అసభ్యకరంగా (హస్తప్రయోగం ప్రవర్తించాడు. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. మీరు హైదరాబాద్ వాసులైతే, ఈ సైక్లింగ్ ట్రాక్ ఉదయం పూట కూడా ఎంత రద్దీగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది.’నా కెమెరా కనీసం 2 మిల్లీసెకన్ల ముందు ఓపెన్ అయ్యి ఉంటే బాగుండేది, వాడి ముఖాన్ని నేను రికార్డ్ చేసి చూపించేదాన్ని. నా కళ్ళ ముందే వాడు అలా అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను వేసుకున్న బట్టలు ఇవే (రన్నింగ్ డ్రెస్).. నేను రన్నింగ్ చేస్తున్నప్పుడు ఇంకేం బట్టలు వేసుకోవాలి? నేను సూర్యోదయానికి ముందు కూడా ఇక్కడికి రాను. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తాను. సూర్యోదయం సమయం చెక్ చేసుకుని ఆ టైంకి నా రన్నింగ్ మొదలుపెడతాను. కనీసం ఈ రన్నింగ్ బట్టలు వేసుకుని ఆటోలో లేదా బైక్పై వెళ్లడం కూడా నాకు సురక్షితంగా అనిపించదు. ఎందుకంటే ఆ ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు అలానే చూస్తూనే ఉంటారు. పైగా కొందరు సుమారు 55 ఏళ్ల వయసున్న అంకుల్స్, ఇది మనకు సురక్షితమైన ప్రదేశం కావాలి కదా? అసలు ఇది హైదరాబాదేనా?” అని తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

పోలీసింగ్ పై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై, అధికారుల బదిలీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘హైదరాబాద్ను సేఫ్ సిటీ అంటారు.. మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పగటి పూట కూడా మహిళలకు భద్రత కరువైందని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ (She Teams) ఎక్కడికి వెళ్లాయని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు పోలీసుల స్పందన కోసం, నిందితుడిపై కఠిన చర్యల కోసం డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking