ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులుగా గొడ్డేటి సత్యం
ఉపాధ్యక్షులుగా వడ్డేమాన్ దేవేందర్
వలిగొండ అక్షిత న్యూస్
వలిగొండ మండల ఉపసర్పంచ్ల కమిటీని మండలంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురకంటి శ్రీధర్ రెడ్డి సమక్షంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా గొడ్డేటి సత్యం, ఉపాధ్యక్షులుగా వడ్డేమాను దేవేందర్, పెద్ద బోయిన చంద్రకళ, శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శులుగా మలుగ మాధవి, అంబటి సాయికుమార్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా మీసాల నరేష్, కార్యదర్శిగా పల్లపు శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా కుసంగి రాములు, కోశాధికారిగా ప్రశాంత్, గౌరవ సలహాదారులుగా సల్ల ఐలయ్య, బి శ్రీనివాస్, రావుల ధనమ్మ పద్మ రెడ్డి, పసుల బాలస్వామి ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.