మహనీయుల స్పూర్తితో సేవలు సాధ్యం

మహనీయుల స్పూర్తితో
సేవలు సాధ్యం

ఐజెయూ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

మహనీయుల స్పూర్తితోనే సేవాభావంతో పనిచేయడం సాధ్యం అవుతుందని ఇందియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. హైద్రాబాద్ చందానగర్ సంకల్ప ఆశ్రమంలో ఐఎఎస్ అధికారి రోనాల్డ్ రాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అవార్డ్ ఎన్జీఓ, కృష్ణ వేణి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధుల సమక్షంలో వెంకటయ్య కుసుమ, కృష్ణవేణీ ఇస్మాయిల్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.తల్లి దండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన అనేక మంది బాల బాలికలకు ఉచిత విద్య భోజనంతో పాటు ఆశ్రయమిచ్చి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న నిర్వాహకురాలు రోజని అభినందించారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరీసా లాంటి త్యాగ గుణం కలిగి పరులకు సేవకోసం జీవితాల్ని త్యాగం చేసి పనిచేస్తున్న వారి సేవలు మరువలేనివి అన్నారు.

ఈ కార్యక్రమంలో అవార్డ్ ఎన్జీఓ నిర్వాహకులు కుసుమ వెంకటయ్య, బబ్లూ,కృష్ణవేణీ ఫౌండేషన్ చైర్మన్ ఎస్ కృష్ణవేణి ఇస్మాయిల్ లతో పాటు హెడ్మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు హేమచంద్ర, స్పూర్తి సంస్థ నిర్వాహకులు, జర్నలిస్టులు లక్ష్మీ నారాయణ, శ్యామ్, శ్రీపతి సంకల్ప నిర్వాహకులు రోజీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking