ప్రభుత్వ పాఠశాలలో నోముల అభిరామ్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ పాఠశాలలో నోముల అభిరామ్ జన్మదిన వేడుకలు

– ఆర్భాటాలకు దూరంగా.. విద్యార్థులకు పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ

– తాను చదివిన పాఠశాలలోనే తన కొడుకు పుట్టినరోజు వేడుకలు 

రామన్నపేట అక్షిత ప్రతినిధి

నేటి కాలంలో జన్మదిన వేడుకలను హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆర్భాటంగా నిర్వహించడం సాధారణమైపోయిన తరుణంలో, ఓ విద్యార్థి తండ్రి తన కొడుకు పుట్టినరోజును తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిపించడం ఆదర్శంగా నిలిచాడు. రామన్నపేట మండలం నీర్నెముల ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు నోముల విష్ణు అన్న లింగస్వామి కుమారుడు అభిరామ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో అభిరామ్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, నోట్‌బుక్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాఠశాలలో ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. నోముల అభిరామ్ జన్మదినాన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకొని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అందరి ప్రశంసలను అందుకున్నారు. ప్రశంసించిన ఉపాధ్యాయులు, గ్రామస్థులు విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కొనియాడారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే విధంగా జన్మదినాన్ని నిర్వహించడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యన్. రవి, ఉపాధ్యాయులు కె . శ్రీనివాస రెడ్డి, విఘ్నేశ్వరరాణి, కృపారాణి, లింగస్వామి, మాధవి, నవ్య, నవనీత. రవి, తల్లితండ్రులు నోముల జీవిత లింగస్వామి, బాబాయ్ విష్ణు, అన్నలు సాయి తేజ, నిఖిల్ తేజ విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking