వర్షాలతో దెబ్బతిన్న సర్వీస్ రోడ్డును పరిశీలించిన మంత్రి
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న దుబ్బపల్లి–జీఆర్‌ఎం టౌన్‌షిప్ సర్వీస్ రోడ్డును తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా దెబ్బతిన్న రోడ్డును వెంటనే పునరుద్ధరించడంతో పాటు వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేలా బాక్స్ కల్వర్ట్ నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని, అవసరమైతే కేంద్ర రహదారుల శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం సాధిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.