కాసిపేట-2 గనిలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం

కాసిపేట-2 గనిలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం

బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకూ సమాన ప్రాధాన్యం

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి 

భావితరాల కోసం హరిత సంకల్పం

డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, మందమరి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సింగరేణి మందమరి ఏరియా పరిధిలోని కాసిపేట-2 గనిలో గురువారం మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, మందమరి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో 2 వేల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ మొక్కలు నాటడం భావితరాలకు అమూల్యమైన ఆస్తి అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తోందని జీఎం రాధాకృష్ణ తెలిపారు. ఈ ఏడాది 38 హెక్టార్ల సీఏ భూములతో పాటు ఖాళీ స్థలాల్లో మొత్తం 1.80 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఓపెన్‌కాస్ట్ గనుల్లో పచ్చదనం పెంపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డీఎఫ్‌ఓ కేకే ఓసీపీ పరిధిలోని సీఏ ల్యాండ్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking