దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన వాసుదేవరెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర సంక్షేమ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి సోమవారం నాడు అంబేద్కర్ సచివాలయంలలో కలిశారు. దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ ను ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడం పట్ల పలువురు దివ్యాంగులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎంగా కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఆర్థిక భరోసాను కల్పించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలిఅన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఒక్క పెన్షన్ సౌకర్యమే కాకుండా.. విద్యా, ఉద్యోగ ఉపాధి రంగాల్లోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం లో 5% రిజర్వేషన్ తో పాటు.. బధిరులకు ప్రత్యేక డిగ్రీ కాలేజి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.

శారీరక దివ్యంగుల రోస్టర్ 56 వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ వివరించి రోస్టర్ తగ్గింపు తదితర అంశాలపై సానుకూలంగా స్పందించారన్నారు. దివ్యాంగులను కంటికి రెప్పలా కాపాడుతున్న సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పదేండ్లలో 10 వేల కోట్లు ఖర్చుపెట్టిన
మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని.., దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన గొప్ప నాయకుడన్నారు.సీఎం కేసీఆర్ ను రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం కలిశారు. దివ్యంగులకు వెయ్యి రూపాయలు, మైనారిటీ లకు లక్ష రూపాయల ఋణం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సీఎం కేసీఆర్ ను స్వయంగా కలిసి ధన్యవాదములు తెలిపారు. మంత్రి వెంట రాష్ట్రదివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు