ప్రేమ కుమార్ ని బిజెపిలోకి ఆహ్వానించిన వడ్డేపల్లి

ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని బిజెపి పార్టీలోకి ఆహ్వానించిన వడ్డేపల్లి

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

కూకట్ పల్లి నుండి మరో నేత బీజేపీ పార్టీలో చేరనున్నారు. కూకట్ పల్లికి చెందిన వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆగస్టు 6వ తేదీన బీజేపీ రాష్ట్ర నేతల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

ఆదివారం కూకట్ పల్లి లోని ఎన్. కే. ఎన్. ఆర్ గార్డెన్ లో ఆత్మీయ కలయిక పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘం నాయకులు, మహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపగా మీ మద్దతు నాకు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేపీ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్,గంధం రాజు, సురభి రవీందర్ రావు, అర్శనపల్లి సూర్యారావు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking