సిఎం సహాయ నిధి పేదల పెన్నిధి
ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిధి అని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 41 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 17 లక్షల 64 వేల 500 రూపాయల విలువ గల చెక్కులను పంపిణి చేశారు.

సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు లబ్దిదారులకు కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా డిసియంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య (సంపత్), మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాపారావు, పాక్స్ చైర్మన్ రాములు గౌడ్, వేములపల్లి మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపిపి ధనవాత్ బాలాజీ నాయక్, వైస్ ఎంపీపీ మల్లీశ్వరి గోపీ, ఏండి యూసుఫ్, జొన్నలగడ్డ రంగారెడ్డి, జడ్పిటిసిలు సేవ్యానాయక్, లలితా హతిరంనాయక్, ఎంపీటీసీలు శ్రీ రామ్రెడ్డి, లక్ష్మి, బాల సత్యనారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బి. వెంకటరమణ చౌదరి బాబీ, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, కొట్ర ఆంజనేయులు, విష్ణు, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.