పల్లెల్లో పారిశుద్ధ్య పనులు మెరుగు పర్చాలి

గ్రామాల్లో పారిశుద్ధ్య
పనులు మెరుగ్గా నిర్వహించాలి

ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య పనులు మెరుగుగా చేసెందుకు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. సోమవారం
మండల ప్రజా పరిషత్ కార్యలయంలో జరిగిన సమావేశంలో కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రోజు మురుగు కాలువలు తీయాలి, వీధులు శుభ్రం చేయాలి, బ్లీచింగ్ పౌడర్ చల్లడం నీరు నిలువ లేకుండా చూడాలని, ఆయిల్ బల్స్ మురుగునీరు నిల్వ ఉన్నచోట వేయాలన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలి హరితహారం టార్గెట్ కు అనుగుణంగా మొక్కలు నాటాలి నాటిన మొక్కను సంరక్షించాలన్నారు. ఉద్యానవనాల మొక్కల పెంపకం కొరకు రైతులని మోటివేషన్ చేయించాలి, గ్రామంచాయతి సిబంధి సమ్మెలో ఉన్నప్పటికీ పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతి రోజు బయటి సిబ్బందిని పెట్టుకొని పని చేయించాలి.

పెన్షన్ పొందేవారు ఒకవేళ చనిపోతే వెంటనే వారి అకౌంటు తొలగించాలని, అర్హులైన పెన్షన్ల దరఖాస్థులుంటే సరైనా పత్రాలతో కార్యాలయంలో సమర్పించాలన్నారు. సకాలంలో ఇవ్వగలరని తగు సూచనలు చేశారు. ఎంపిఓ టీ. వీరారెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు పి.కరుణాకర్ రావు, ఇంచార్జి ఎపిఓ కళావతి, టిఎలు సౌజన్య, పురుషోత్తం, రేణుక కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking