అర్జీలను సత్వరం పరిష్కారం చేయాలి

అర్జీలను సత్వరం
పరిష్కారం చేయాలి

జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా అధికారులను సమావేశ పరిచి అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని,శాఖల మధ్య అంతర్గత సమస్యలు వుంటే పరిష్కరించుకోవాలని అన్నారు.ప్రజావాణి లో ప్రజల నుండి అందిన పిర్యాదులు స్వీకరించి సంబంధిత జిల్లా అధికారుల కు ఎండార్స్ చేస్తూ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ, దివ్యాంగుల పెన్షన్ లు, బి.సి.,మైనార్టీ, ఎస్.సి.కార్పొరేషన్ శాఖలకు సంబంధించి అర్జీలు అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking