అభివృద్ధి పనులు
వేగవంతంగా చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నల్లగొండ మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, ఎస్.పి.డి.సి.ఎల్ అధికారులతో మున్సిపాలిటీ లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రగతి పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లగొండ మున్సిపాలిటీ ప్రారంభమైన నాటి స్థితిగతులు ఏమిటి, ప్రస్తుత జనాభా ఎంత, పట్టణ పరిధి ఎంతవరకు విస్తరించి ఉన్నది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా సరైన రీతిలో అందుతుందా, తాగునీటిని ఎక్కడినుండి సప్లై చేస్తున్నారు. ఏ విధంగా అందిస్తున్నారు. ఎన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి. పైపులైన్ల ద్వారానా లేక ట్యాంకర్ల ద్వారానా అని ప్రశ్నించగా, అధికారులు కలెక్టర్ కు వివరించారు. నుడా ఏర్పడ్డాక జరిగిన పనుల వివరాలను తనకు పంపించాలని అధికారులను కోరారు. నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా చేస్తున్న పనులు ప్రగతి వివరాలు ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 2023 నాటికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాలు వస్తున్నందున అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఐటీ టవర్ పనులు త్వరితగతన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రo ఏర్పడ్డాక ఎన్ని పనులు జరిగాయి, ఎంత బడ్జెట్ కేటాయించారు తదితర వివరాలు తనకు నివేదిక రూపం లో అందించాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, పబ్లిక్ హెల్త్ ఈ ఈ సత్య నారాయణ,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు,
కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.