త్యాగం, మానవత్వం
కలబోతే క్రీస్తు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
“త్యాగం, మానవత్వం కలబోతే యేసుక్రీస్తు అన్నారు రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రాఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” ప్రపంచంలో నిజం కోసం, ప్రజలకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దపడిన త్యాగమూర్తి యేసుక్రీస్తు అని అయన అన్నారు.ఇవ్వాలా క్రిస్మస్ సందర్బంగా నల్గొండ పట్టణంలోని సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, క్లాక్ టవర్ సెంటర్లో గల బాప్టిస్ట్ చర్చి, సీబీసీ చర్చ్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి ఆయన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ,
– 27 సంవత్సరాలుగా నగరంలోని చర్చిలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. తనపై ప్రేమతో ఆదరించిన క్రైస్తవ బంధువులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.ఇందిరమ్మ రాజ్యంలో సర్వమతాలకు సమాన గౌరవం, గుర్తింపు ఉంటాయని ఆయన అన్నారు. సమానత్వం నిండిన సంక్షేమరాజ్యమే ఇందిరమ్మ రాజ్యమని.. క్రిస్టియన్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రార్థనలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ తో పాటు 2024 రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

యేసుక్రీస్తు ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.చర్చి పునరుద్ధరణలో భాగంగా ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం లిటిల్ ఫ్లవర్ ఇన్నోవేటివ్ స్కూల్ లో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు.రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినందున సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉంచుతామని ఆయన అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు పథకాన్ని అమలుపరచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరికీ పౌర సేవలలో భాగంగా ప్రజా పరిపాలన అందిస్తామని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పాలన చేరువ చేయడానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్ పాటిల్, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్చి స్పీకర్ పండు ప్రేమ్ కుమార్, పాస్టర్ సతీష్ చంద్రదాస్, ప్రెసిడెంట్ సి.ఎస్ క్రిస్టఫర్, చర్చ్ ప్రతినిధులు అప్షాలుమ్, కృపానందం, ఆనంద్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం చివరిలో క్రైస్తవ మత పెద్దలు మంత్రికి ఆశీర్వచనాలు అందచేశారు.

అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 కోట్ల 25 లక్షల రూపాయల తో నిర్మితమవుతున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను విఐపి గెస్ట్ హౌస్ గా తీర్చిదిద్దాలని ఇంజనీర్లను ఆదేశించారు. అంతేగాక ఎంట్రెన్స్ గేట్ పెద్దగా ఉండేటట్లు చూడాలని ఆయన తెలిపారు. గెస్ట్ హౌస్ నిర్మాణం ఎనిమిది నెలలో పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను కోరారు.