క్రైస్తవ్యం మంచి మార్గం
ఎస్ ఆర్ పాఠశాలలో
సెమీ క్రిస్మస్ వేడుకలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక ఎస్సార్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంగారుగడ్డ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షులు పిఆర్ ఎలీషా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రైస్తవ్యం అనేది మనిషికి ఒక మంచి మార్గమని అన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ మాజీ జెడ్పిటిసి దోసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయుల మాటలు గైకొని సన్మార్గంలో నడిచి దేవుడు మెచ్చే విధంగా వినయ విధేయతతో మెలిగి దేశానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు.

అనంతరం ఆ పాఠశాల ప్రిన్సిపల్ పుట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం సర్వమత సమ్మేళనం అని కొనియాడారు. అదేవిధంగా క్రిస్మస్ ప్రాధాన్యతను తెలియజేస్తూ, విద్యార్థులు చిన్నతనం నుండే మంచి ప్రవర్తన కలిగి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి జాతి గర్వించే విద్యార్థులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరస్వతి, రమేష్, విజయలక్ష్మి, రామకృష్ణ, రఫీ, లతీఫ్, శ్రావణి, అజ్గార్, అశోక్ కుమార్, వాణి,వసంత ,నేహ, రమ్య, నాగలక్ష్మి, అరుణ, సుధా, శిరీష ,అనిత, శోభ రాణి, శిరీష మరియు వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గా ప్రసాద్, విద్యార్థులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.