క్రీడలతో మానసిక ఉల్లాసo
67వ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మెరిసిన ఎస్ ఆర్ విద్యార్థులు
పుట్టల శ్రీనివాస్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 67వ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రీడలలో అండర్ 14 విభాగంలో, తైఖోండోలో, స్థానిక ఎస్ ఆర్ పాఠశాల చెందిన విద్యార్థిని మైరా కుల్సుమ్ స్వర్ణ పథకం సాధించారు. మరియు బ్యాట్మెంటన్ లో ఆకుల వైష్ణవి స్వర్ణ పథకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.

ఈ సందర్భంగా ఆ పాఠశాలల డైరెక్టర్ ఎ. సంతోష్ రెడ్డి , చీఫ్ జోనల్ ఇంచార్జ్ మనోజ్ కుమార్, జోనల్ మేనేజర్ రమణ , జోనల్ ఇంచార్జ్ ఎస్ ఎల్ రణధీర్ లు విద్యార్థులను అభినందించారు. సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపల్ పుట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసి ఉల్లాసాన్ని కలిగించి స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో గెలుపొందిన పతకాలను మరియు మెమెంటోలను అందించి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరస్వతి, రమేష్, విజయలక్ష్మి, రామకృష్ణ,రఫీ ,లతీఫ్ ,శ్రావణి ,అజ్గార్, అశోక్ కుమార్, వాణి, వసంత, నేహ, రమ్య నాగలక్ష్మి, అరుణ, సుధా, శిరీష, అనిత, శోభ రాణి, శిరీష మరియు వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.