ఖమ్మంలో ఆటోమోటివ్ కార్ యాక్ససిరీస్ షోరూమ్ ప్రారంభం

ఖమ్మంలో ఆటోమోటివ్ కార్ యాక్ససిరీస్ షోరూమ్ ప్రారంభం

-ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరంలో ఆటోమోటివ్ కార్ యాక్ససిరీస్ నూతన షోరూమ్ ను రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కార్ స్పేర్ పార్ట్స్ అండ్ యాక్ససిరీస్ రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా ఖమ్మం నగరం వర్తక వాణిజ్య వ్యాపార రంగాలలో మరింత విస్తరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఖమ్మం యువకులు ఈ రంగంలో తమ ప్రావీణ్యతను అనుభవాన్ని జత కలిపి వినియోగదారులకు నాణ్యమైన సేవలను మన్నికైన వస్తువులను అందించి వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే తమ వ్యాపారాలు లాభసాటిగా ఆప్యాయతతో కొనసాగుతాయని మంత్రి పొంగులేటి అన్నారు.సంస్థ యజమానులు జావీద్ ఇమ్రాన్ ఇద్దరు కలిసి సంస్థను ఏర్పాటు చేసుకుని ఆటోమోటివ్ కార్ యాక్సిసిరీస్ నూతన షోరూమ్ సేవలను మరిన్ని బ్రాoచులుగా విస్తరించే విధంగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు.మంత్రి పొంగులేటి కి జావీద్ ఇమ్రాన్ లు శాలువాతో ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking