*విజయవంతంగా సంకల్పయాత్ర*
*జి హెచ్ ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి*
*వనస్థలిపురం ,అక్షిత ప్రతినిధి*
భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర లో భాగంగా సంకల్పయాత్ర బి.యన్ రెడ్డి నగర్ నుంచి వెళ్తున్న సందర్భంగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు జాతీయ నాయకులు ఈటల రాజేందర్ , కామారెడ్డి శాసనసభ్యులు కటిపల్లి వెంకటరమణారెడ్డి ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు , ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి విచ్చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి , మరియు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విజయ సంకల్ప యాత్రకు భారీ ఎత్తున తరలిరావడం చాలా సంతోషంగా ఉందని. విజయ సంకల్పయాత్ర విజయవంతం కావడంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజం కలుగుతుంది అని అన్నారు.