దర్జాగా కబ్జా ?

దర్జాగా కబ్జా ?

రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందిన చర్యలు ఏవి..?

కబ్జాదారులతో కుమ్మక్క !

మేడ్చల్, అక్షిత బ్యూరో :

ఖాళీ జాగా కనిపిస్తే చాలు… కబ్జా చేసుకోవచ్చు. పట్ట పగలే టిప్పర్లతో మట్టిని నింపి చదును చేసి ఎం చక్కా కబ్జా చేస్తుండ్రు. కబ్జా స్థలాలపై రెవిన్యూ యంత్రాంగం కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దుండిగల్ గండిమైసమ్మ మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలు కాపాడటంలో రెవెన్యూ అధికారులు విఫలమౌతున్నారని బలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలో బౌరంపేటలోని సర్వే నంబర్ 166 లో సుమారుగా ఎకరా ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా భారీగా స్కెచ్, బౌరంపేట్ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎదురుగా సమీపంలో కొత్తగా నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో పట్టపగలే టిప్పర్లతో మట్టిని నింపి సుమారుగా ఎకరా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు దర్జాగా కబ్జాకు ప్రయత్నం. ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ స్థలంలో టిప్పర్లతో మట్టిని నింపి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ అధికారుల తీరుపై స్థానికులు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలకు పాల్పడితే చర్యలేవి..?

సర్వే నంబర్ 166 ప్రభుత్వ భూమికి ఆనుకొని సర్వే నంబర్ 191,192 లో కొంత పట్టా భూమి ఉంది. అతని స్థలానికి అనుకోని ఉన్న ప్రభుత్వ స్థలంలో దర్జాగా కబ్జా జరుగుతున్న తడవుగా ప్రభుత్వ టిప్పర్లతో మట్టిని నింపి చదును చేసేశాడు,కళ్ళముందే కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కనుమరుగవుతున్న కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటూ కబ్జాదారులతో అధికారులు చేతివాటాలతో సరిపెడుతున్నట్లేనా.? విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తి బై నంబర్ వేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు స్థానికుల సమాచారం. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని 166 లో జరిగే ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking