రక్త దానం ఆపదలో ఉన్నవారికి ప్రాణ దానం
సికేఎం కళాశాల ప్రిన్సిపాల్ డా.శశిధర్ రావు*
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్ సికేఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా జి శశిధరావు అధ్యక్షతన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యుడు డా కిషన్ రావు,సిబ్బంది ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా ఏ ధర్మారెడ్డి లైబ్రరియన్ అనిల్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డా సతీష్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ పి ధర్మయ్య, డా గంగయ్య, డా ఉదయలక్ష్మి,సూపరింటెండెంట్ శ్రీనివాస్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గోన్నారు.