క్రీడలతో మానసిక ఉల్లాసం

అమనగల్లులో ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి క్రికెట్ క్రీడాపోటీలు
వేములపల్లి, అక్షితప్రతినిధి:
వేములపల్లి మండలం అమనగల్లు గ్రామంలోని శ్రీశ్రీశ్రీపార్వతిరామలింగేశ్వరస్వామి జాతరను పురస్కరించుకొని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి క్రికెట్ క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు -అశోక కుమారి తెలిపారు. ఆదివారం మండలంలోని అమనగల్లు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి జాతరను పురస్కరించుకొని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీల పోస్టర్లను అయన ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ క్రికెట్ పోటీలలో పాల్గొనే ఆసక్తి కల్గిన క్రీడాకారులు, జట్లు ఈ నెల 17,18, లోపు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి కీ. శే. యాలికంటి లింగారావు జ్ఞాపకార్థం, మనువాళ్లు అనీష్, అఖిల్, సహకారంతో రూ.20,116, తోపాటు షిల్డ్, ద్వితీయ బహుమతి చిర్యాల కిరణ్ -జ్యోతి మిర్యాలగూడ సహకారంతో రూ.15,116, తోపాటు షిల్డ్, తృతీయ బహుమతి కీ. శే. కోలా వెంకటయ్య జ్ఞాపకార్థం కుమారులు కోలా వీరస్వామి, లక్ష్మణ్ సహకారంతో రూ.12,116, తోపాటు షిల్డ్, చతుర్ధ బహుమతి రామలింగ డయాగ్నస్టిక్స్ సెంటర్ అమనగల్లు సహకారంతో రూ.10,116,తోపాటు షిల్డ్ అందజేయడం జరుగుతుందన్నారు. మార్చి 17,18, లోపు నమోదుచేసుకున్న టీములకు మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. క్రీడాల నిర్వహణలో అంఫెర్ల దే తుది నిర్ణయమని, ఒకజట్టులో ఆడిన క్రీడాకారుడు మరో జట్టులో ఆడేందుకు ఆవకాశం లేదన్నారు. ఎవరి కిట్టును వారే తీసుకోని రావాలని, ప్రతి మ్యాచ్ కు రెడ్ టెన్నిస్ బాల్ మాత్రమే వాడాలన్నారు.8498906071,9912390405,8106979031, వివరాలకు పైన పేర్కొన్న సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking