బీఆర్ఎస్ కు ‘విరిగినేని’ రాజీనామా

బీఆర్ఎస్ కు ‘విరిగినేని’ రాజీనామా
నిడమనూరు, అక్షిత ప్రతినిధి :
బీఆర్ఎస్ పార్టీ నేత, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. నిడమనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీలో బలమైన నేతగా పేరున్న అంజయ్య రాజీనామా చర్చనీయంశమైంది. బహుజన సమాజ్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking