*బిజెపికి ఓటేసి మళ్ళీ మోడీని గెలిపించాలి
బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి:
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓటేసి మూడోసారి మోడీ నిగెలిపించాలని బిజెపి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం రాత్రి వేములపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లడుతూ ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి మరోసారి మోడీకి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలుచేపట్టడం జరిగిందని, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన,ముద్ర బ్యాంకు రుణాలు తో బడుగు బలహీన వర్గాల ప్రజలను మోడీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జి సాధినేని శ్రీనివాసరావు,మండలపార్టీ అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు కర్ర దామోదర్ రెడ్డి, రవి, సత్యనారాయణ సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.