నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతృత్వ పాలన సాగిస్తున్న బిజెపి అవినీతిమయంలో కూరుకుపోయిన బిఆర్ఎస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ సీఎల్పీ నేత కందూరు జానారెడ్డి అన్నారు బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపిమతం మాటున కులాల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తుందని నిరుద్యోగ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం 30 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించి భారత యువతను మోసం చేసిందన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి మరికొంత పెంచే యోచనలో ఉంటే బిజెపి మాత్రం ముస్లింల రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల హామీ మేరకు ఐదు న్యాయపత్రాల ద్వారా 25 హామీలను నెరవేర్చడంతో పాటు ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తుందన్నారు. రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా అధికారం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయంలో కూరుకుపోయిందని కోటానుకోట్లు అప్పులో తెలంగాణను నిట్ట నిలువునా ముంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అనేక బహులార్ధక ప్రాజెక్టు ఆయన శ్రీశైలం నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే హరిత విప్లవం తో ఆహార ధాన్యాలు గణనీయంగా ఉత్పత్తి సాధించి విలువలు చేసుకుంటే బిజెపి పాలనలో సివిల్ సప్లై ద్వారా పంపిణీ చేస్తూ తామే అభివృద్ధిలో ముందున్నామని చెప్పుకుంటుందన్నారు సిబిఐ ఈడి వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందన్నారు
*తీన్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించాలి*
9 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధిక మెజార్టీతో గెలిపించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, పిసిసి సభ్యుడు చిరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య యాదవ్, ముండ్లగిరి కాంతయ్య, ఎంపిపి పుట్టల సునీత కృపయ్య, వైస్ ఎంపిపి పాదూరి గోవర్ధని,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, నాయకులు రేగట్టే రవీందర్ రెడ్డి, కందిమల్ల లక్ష్మారెడ్డి, ఏలే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు