కదిలిన కాంగ్రెస్ జనసైన్యం

కదిలిన కాంగ్రెస్ జనసైన్యం

డప్పు చప్పులు.. కోలాట నృత్యాలు

రఘువీరుడికి అపూర్వ స్వాగతం

మోతేలో కాంగ్రెస్ కు జనాదరణ

కోదాడ, అక్షిత ప్రతినిధి :

మూడు రంగుల జెండా చేబూని… ఊరు, వాడా జన సైన్యంలా కదిలింది. డప్పు చప్పులు.. కోలాట నృత్యాలతో ఊరూరా జనం జేజేలు పలుకుతుండ్రు.సుదీర్గ రాజకీయానుభవం గడించిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరారెడ్డికి ఊరూరా జనం దండులా కదులుతుండ్రు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కుందూరు రఘువీరారెడ్డికి పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఊర్లో చక్కటి ఆదరణ లభిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుంగు శిష్యుడుగా ఉన్న రఘువీరారెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. రాష్టంలోనే చక్కటి పేరొంది యుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలోననూ తిరుగులేని రాజకీయ చతురత కల్గిన జానారెడ్డి తనయులను రాజకీయ అరంగ్రేటం చేయించారు. ఇప్పటికి కుందూరు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ కు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో తనయుడు రఘువీరారెడ్డిని పార్లమెంటు బరిలో నిలిపారు.

కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్గొండ పార్లమెంట్ కావడంతో పాటు తండ్రికి ఉన్న పరిచయాలు, రాజకీయ చతురత మరింత ఉపయుక్తం కానుంది. దేవరకొండ.. మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, హజూర్ నగర్ అసెంబ్లీల వరిధికి గాను ఒక్క సూర్యాపేట మినహా అన్ని అసెంబ్లీ స్థానాలను హస్తగతం చేసుకున్న సంగతి విధితమే. ఇదే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీంతో ప్రతిష్టాత్మకంగా భావించి రఘువీరారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి పల్లె, పట్నం బాటపట్టారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు అఖండ స్వాగతం పలుకుతుండ్రు. డప్పు చప్పులు, కోలాటాలు, నృత్యాల నడుమ రఘువీరారెడ్డి ప్రచార సరళి సాగుతుంది. ఆయా కార్నర్ మీటింగ్ ల్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయా అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ప్రచార పర్వంలో తలమునకలయ్యారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ఆయా పల్లెల్లో ఉదయం, సాయంత్రo వేళల్లో ప్రచారాన్ని సాగిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆరు గ్యారంటీల అమలుకు తోడు మరిన్ని హామీలిస్తూ ప్రచారాన్ని చేవడుతుండ్రు. గురువారం కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలంలో రఘువీరారెడ్డి ప్రచార యాత్ర సాగింది. రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి మతపరమైన రాజకీయాలతో లబ్దిపొందాలని చూస్తుందని, తెలంగాణకు మోదీ, అమిత్ షా లు చేసేందేమిలేదన్నారు. మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే…. రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. ఎస్ఆర్ఎస్ఐ ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ తో మోతే మండలానికి నీళ్లందిస్తామన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ మోతె మండలంతో తనకు విడదీయరాని అనుబంధముందని, తన తనయుడు రఘువీరారెడ్డికి అత్యధిక ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. పేదలందరికి రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామన్నారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల కష్టoతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మోతె మండలానికి రూ.40 కోట్లు మంజారవ్వడం సంతోషంగా ఉందన్నారు.

రఘువీరారెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్లకు పంపాలన్నారు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ వ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎక్కడకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథంపడుతున్నారన్నారు. ప్రజల మేలు మరిచిపోనన్నారు. బిజెపి, బిఆర్ఎస్ లను మట్టికరపించాలని, కాంగ్రెస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. నల్గొండ పార్లమెంట్ ను అన్నిరంగాల్లో అభివృద్ది చేసి అగ్రగామిగా నిలుపుతామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking