సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు కలగాలి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి :
హనుమంతుడి జయంతిని పురస్కరించుకొని సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు కలగాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆకాంక్షించారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా చైతన్యపురి డివిజన్ మారుతినగర్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఎల్లప్పుడూ హనుమంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.ఆదర్శ సేవకుడు, కర్తవ్య దీక్షా పరాయణుడు, అచంచల రామభక్తుడుగా విశిష్ట భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి, లింగాల నాగేశ్వర రావు, మల్లేష్, బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.