మీ శ్రమే మీ భవితకు పునాధి

మీ శ్రమే మీ భవితకు పునాధి

కష్టపడితే ఉజ్వల భవిష్యత్

రియల్ అడ్వయిజర్ శేఖర్ పులుగుర్త

తార్నాక, అక్షిత ప్రతినిధి :

పెట్టుబడి లేకుండా మీ శ్రమే మీ భవితకు పునాధిలాంటిదని రియల్ రంగంలో విశిష్ట అనుభవం గడించిన రియల్ అడ్వయిజర్ శేఖర్ పులుగుర్త అన్నారు. గురువారం తార్నాకలోని రాజా ఇన్ఫ్రా డెవలఫర్స్ మార్కెటింగ్ టీంను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కష్టపడితే ఉజ్వల భవిష్యత్ మీ సొంతం కానుందన్నారు. పైసా పెట్టుబడి లేకుండా మీ సమయాన్ని వెచ్చించి మార్కెటింగ్ రంగంలో దూసుకెళ్లాలన్నారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విల్లా ప్రైం ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు మరింత విస్తరిస్తుందని, రియల్ రంగంలో రారాజుగా విలసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓపెన్ ప్లాట్, అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ కంటే హైదరాబాద్ నగర వాసులు ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటితో కూడిన విల్లాలపై దృష్టిసారించారన్నారు.

సువిశాలంగా ఉన్న విల్లాల్లో విలాసంగా ఉండేందుకు ఎంతటి ఖర్చుకు కూడా వెనుకాడడం లేదన్నారు. సకల సదుపాయాలు కల్గి ఉండి అత్యాధునిక వసతులున్న విల్లాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉత్సుకతప్రదర్శిస్తున్నారన్నారు. రాజా ఇన్ ఫ్రా డెవలఫర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రీనరీ, హరిత ప్రాధాన్యతతో కూడిన అత్యాధునిక వసతులతో నిర్మలా ట్రాన్ క్విల్ విల్లాలను గౌరెల్లిలో అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో 8.4 ఎకరాల్లో 110 విల్లాలు, 175-234 గజాల్లో 2975, 3978 చ.అ. విస్తీర్ణంలో సువిశాలమైన విల్లాలను అందుబాటుల్లోకి తెచ్చామని, మునుపెన్నడు లేనివిధంగా విల్లామెట్స్, 20 వేల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇన్ వెస్టర్లు పెట్టిన పెట్టుబడికి అనతి కాలంలోనే ఎన్నో రెట్లు అధికం కానుందన్నారు. అనంతరం శేఖర్ పులుగుర్త, జనపరెడ్డి రవీందర్ లనురాజా ఇన్ ఫ్రా డెవలఫర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు, అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ యం శాలువాలతో సత్కరించారు. రాజా ఇన్ ఫ్రా డెవలఫర్స్ సేల్స్ డైరెక్టర్ గా జనపరెడ్డి రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజా ఇన్ ఫ్రా డెవలఫర్స్ హెచ్ ఓడి రజని, గాయత్రి, స్నేహ, నీరజ, భాను, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking