రాజారాంపేట గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజారాంపేటలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాయపూడి రామారావు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు తెల్లం వెంకట్రావు జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.