వంగూరు పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ 

వంగూరు పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ 

నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి

అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు పట్టణంలోని అనంత రాములు కాలనీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ   పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాలలే పునాది. పోలియో రహిత భారతదేశాన్ని సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం.మన నియోజకవర్గంలో ఒక్క చిన్నారి కూడా ఈ వ్యాధి బారిన పడకూడదనే లక్ష్యంతో మన ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.తల్లిదండ్రులందరికీ నా విన్నపం ఒక్కటే… మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా మార్చడానికి, ఐదేళ్లలోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి.నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని మాట్లాడడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking