రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం…?

రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం…?

గతంలో టిపిఓ దృష్టికి వెళ్లిన ఆగని నిర్మాణ పనులు 

సూర్యాపేట , అక్షిత ప్రతినిధి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 13వ వార్డు గాంధీనగర్‌లో ఓ వ్యక్తి రహదారిని ఆక్రమించి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత 50 ఏళ్లుగా స్థానిక ప్రజలు ఉపయోగిస్తున్న ఈ రోడ్డుని అడ్డంగా ఆక్రమించి ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని స్థానిక ప్రజలు పేర్కొoటున్నారు.కాగా ఇంటి రిజిస్ట్రేషన్ కోసం నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ రహదారిని తమ సొంత స్థలంగా చూపిస్తూ నిర్మాణం చేపడుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.అందుకు గతంలో ఈ విషయాన్ని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అట్టి నిర్మాణాన్ని నిలిపివేసినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా ఇటీవల కాలం నుండి రాత్రిళ్ళు మళ్లీ ఇంటి నిర్మాణపు పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.అంతేకాక గాంధీనగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వాటర్‌ మ్యాన్ కూడా మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ నిర్మాణానికి తాగునీటి కోసం నల్లా కనెక్షన్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.నిత్యం ప్రజల రాకపోకలకు ఉపయోగపడే ఈ రహదారిని ఆక్రమించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవకోవడమే కాకుండా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అందుకు సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ప్రజలు ఆరోపిస్తున్నారు.అంతేగాక ఈ స్థలం నాది అని చెప్పుకునే సంబంధిత వ్యక్తులతో పాటు వారికి సహకరించిన వ్యక్తులపైనా, అధికారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking