వంగూరు పట్టణ కేంద్రంలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం
అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైన ఆయుధం ‘ఓటు’. ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సందర్భంగా అధికారులతో వారు మాట్లాడుతూ:- ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్నా ఈ ఓటర్ మ్యాపింగ్ అత్యంత కీలకం.ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయడమే ఈ మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన అచ్చంపేట నియోజకవర్గంలో, ముఖ్యంగా వంగూరు మండలంలో* ఎక్కడా సాంకేతిక లోపాలు లేకుండా, ప్రతి ఒక్క ఓటరు వివరాలు సరిగ్గా నమోదయ్యేలా క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలి..యువత, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేలా చూడాలి.._ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ క్రతువులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతున్నాను