కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు
నిడమనూరు, అక్షిత న్యూస్ :
కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన సంఘటన నిడమనూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక గండయ్య బజార్లో నుంచి వెళ్తున్న మంగినపల్లి వెంకటయ్య (60) పై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఘటనలో వెంకటయ్యకు రక్త గాయాలవగా అక్కడున్నవారు కోతుల బారి నుంచి వెంకటయ్యను రక్షించారు. గాయపడిన వెంకటయ్యను ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య చికిత్స అందించారు. అను నిత్యం కోతుల దాడులతో పట్టణంలోని ప్రజలు హడలిపోతున్నారు. అనునిత్యం గ్రామములో ఏదో ఒక చోట కోతుల బారిన పొడి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. గడచిన రెండు నెలల కాలంలో సుమారు 20 మందికీ పైగా కోతుల దాడిలో గాయాలపాలైన తీరు కోతుల స్వైర విహారానికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి, సత్వర చర్యలు చేపట్టి కోతుల బారి నుంచి ప్రజలను కాపాడాలని గ్రామసులు కోరుతున్నారు.