టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన దామరగిద్ద ఉప సర్పంచ్ సత్యనారాయణ
దామరగిద్ద ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించిన గవినోళ్ల శ్రీనివాస్
నారాయణపేట,అక్షిత ప్రతినిధి:
నారాయణపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్‌ను దామరగిద్ద మండల కేంద్ర ఉప సర్పంచ్ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దామరగిద్ద మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు. అనంతరం ఉప సర్పంచ్ సత్యనారాయణతో పాటు వార్డు సభ్యులు బొడ్డెం రాజు, వెంకటేష్, నీలి వెంకట్రాములను గవినోళ్ల శ్రీనివాస్ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గవినోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.