నారాయణపేట యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిలేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడిగా రవి గౌడ్ నియామకం

నారాయణపేట యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిలేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడిగా రవి గౌడ్ నియామకం

నారాయణ పేట,అక్షిత ప్రతినిధి:

నారాయణపేట యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్.అఖిలేష్ రెడ్డి,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా రవి గౌడ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నారాయణపేటలోని సీవీఆర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకుడు బండి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పాల్గొని నూతనంగా నియమితులైన నాయకులకు అభినందనలు తెలియజేశారు.అనంతరం అఖిలేష్ రెడ్డి,రవి గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking