569 వ రోజుకు మీల్స్ ఆన్ వీల్స్

569 వ రోజుకు
మీల్స్ ఆన్ వీల్స్

ఏరియా ఆసుపత్రిలో అల్పాహార వితరణ

డైమండ్ శ్రీనివాస్ దాతృత్వం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

పేదింటి బిడ్డలకు కాసింత ఆసరాగా నిలిచేందుకు మీల్స్ ఆన్ వీల్స్ 569 వ రోజుకు చేరింది. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ డైమండ్ శ్రీనివాస్ ( మాశెట్టి) ప్రోగ్రాం ఛైర్మన్ గా వ్యవహరిస్తూ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన మీల్స్ ఆన్ వీల్స్ 569 రోజులుగా సాగుతుంది. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి వివిధ చికిత్సలకై ఆసుపత్రిలోకి వచ్చే పేద రోగులు, సహాయకులకు అల్పాహారమందించేందుకు డైమండ్ శ్రీనివాస్ మీల్స్ ఆన్ వీల్స్ కు శ్రీకారం చుట్టారు.

తను సహాయం చేయటంతో పాటు మరింత మందిని ప్రోత్సహిస్తూ నిర్విఘ్నంగా 569 రోజులుగా చేపడుతుండ్రు. సోమవారం లయన్ యారాల ప్రభాకర్ రెడ్డి, నికిత- సందీప్ ల వివాహ వేడుకలను పురస్కరించుకుని మీల్స్ ఆన్ వీల్స్ కు చేయూత నందించారు. దీంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మిర్యాలగూడ నందు ఉదయం 8.00 గంటలకు లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మీల్స్ ఆన్ విల్స్ ప్రోగ్రాం చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ చేపట్టారు. అరటి పండ్లు, కేక్ బ్రెడ్స్ తదితర వాటిని అల్పాహారంగా సుమారు 250 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి, బియం నాయుడు, కోలా సైదులు, గట్టు వెంకటేశ్వర్లు, వాలంటరీ రఫీ, సుందరి నాగయ్య, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking