రైల్వే ప్రయాణికులకు ఆసరా
వెయ్యి మందికి పైగానే
అల్పాహార వితరణ
లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ డైమండ్ శ్రీనివాస్ ఔదార్యం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సేవల్లో మేటి… డైమండ్ శ్రీనివాస్. ఎక్కడ అవసరత ఉందో అక్కడ వాలిపోతారు. ఆకలికి అలమటించే పేదల మధ్య నేనున్నానంటూ ఏరియా ఆసుపత్రిలో అల్పాహార వితరణ. రోజులు… నెలలు కాదు ఏకంగా సంవత్సరాల తరబడి తనతో పాటు సేవా గుణం కల్గిన ఇంకొంత మందిని ప్రోత్సహిస్తూ ఆసుపత్రిలో రోగులు, అటెండెన్స్ ( రోగుల బంధువులకు అల్పాహారాన్ని అందిస్తూ పేదింటి బిడ్డలకు డైమండ్ పెన్నిధిగా మారాడు. వ్యక్తిగత సేవలతో పాటుగా లయన్స్ క్లబ్ పేరిట ఏళ్ళతరబడి సేవలందిస్తూ పేదోళ్ళ ఆకలి తీర్చుతూ ఆపద్బాంధవుడుగా పేరొందాడు.
చిరు ప్రాయం నుంచే సేవాగుణం అవలక్షణాలను పుణికిపుచ్చుకున్న డైమండ్ శ్రీనివాస్ తనకున్న దాంట్లో కొంత దానం చేస్తూ గొప్ప సేవాతత్పరుడుగా నిలిచాడు. ఆదివారం గూడ్స్ రైలు ప్రమాదం చోటుచేసుకుని మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో వందలాది మంది రైల్వే ప్రయాణికులు మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో అల్పాహారం, తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సమాచారం అందుకున్న లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ జాయింట్ సెక్రటరీ డైమండ్ శ్రీనివాస్ ( మాశెట్టి) హుటాహుటిన అక్కడికి చేరుకుని వెయ్యి మందికి పైగానే అల్పాహార వితరణ గావించారు.
ప్రయాణికుల ఇక్కట్లను గమనించి కాసింత ఆసరాగా నిలిచిన డైమండ్ శ్రీనివాస్ ఔదార్యం వెలకట్టలేనిది. డైమండ్ శ్రీనివాస్ వెంట లయన్ లీడర్ బిఎం నాయుడు, ఏచూరి మురహరి తదితరులు భాగస్వాములయ్యారు.