పచ్చిరొట్టె విత్తనాలు రైతులకు 90శాతం సబ్సిడిపై సరిపడ సరఫరా చేయాలి

పచ్చిరొట్టె విత్తనాలు రైతులకు 90శాతం సబ్సిడిపై సరిపడ సరఫరా చేయాలి

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి :

తొలకరి వర్షాలు మొదలైన సందర్బంగా జిల్లా వ్యాప్తంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి జీవ ఎరువులైన పచ్చిరొట్టె విత్తనాలు,జిలుగు,జనుము,పిల్లి పెసర ను రైతులకు 90 శాతం సబ్సిడీ ద్వారా అందివ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వానాకాలం సిజన్ రావడంతో పచ్చిరొట్టె విత్తనాలు వేసేందుకు రైతులు చొరవచూపిస్తున్నారు. పిఎసిఎస్ ద్వారా విత్తనాలు సరఫరా చేసినా 25శాతం మాత్రమే రావడంతో చాలామంది రైతులు విత్తనాలు అందక వెనుతిరగాల్సి వస్తుందన్నారు.రసాయనిక ఎరువుల వాడకం పెరిగి భూసారాన్ని ద్వంసం చేస్తున్న తరుణంలో జిలుగు విత్తనాలు వ్యవసాయ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి రైతులకు సరిపడా అందివ్వాలని అన్నారు. వర్షాలు ప్రారంభమై రైతులు దున్నకాలు ప్రారంభించిన సందర్బంగా జీవ ఎరువులై విత్తనాలను రైతాంగానికి వెంటనే సరిపడ సరఫరా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు గన్నెబోయిన విజయభాస్కర్,బోయిని ఆనంద్,కందుల హనుమంతు,పులి భిక్షం,బోళ్ళ వెంకటేశం,ఎర్ర కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking