ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
కోదాడ, అక్షిత ప్రతినిధి :
కోదాడ పట్టణంలోని స్థానిక గ్రంథాలయo నందు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ని కలిసి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ మెంబర్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొ ని సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, కోదాడ నియోజకవర్గ ఫాస్టర్ అధ్యక్షుడు యెషయా, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ కంపాటి పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కుడుముల లక్ష్మీనారాయణ, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షుడు కుడుముల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దావల్, పాలడుగు సంజీవ్,కొండలు,వేముల పుల్లయ్య, కుడుముల శ్రీకాంత్, రజిని,తదితరులు పాల్గొన్నారు…