మా భూమి అమ్మనందుకు మాపై దాడి కేసులా…?

మా భూమి అమ్మనందుకు మాపై దాడి కేసులా…?

త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ యాజమాన్యాన్ని, మేకల వెంకటేశంను వదిలి మా వారిపై అక్రమ కేసులు బనాయించారంటూ ఆందోళన వ్యక్తం చేసిన బాదిత మహిళలు

విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన బాదిత కుటుంబ సభ్యులు…

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరది భౌరంపెట్ లోని వ్యవసాయ భూమిని అమ్మనందుకు కిరాయి గుండాలతో తమపై దాడికి యత్నించిన త్రిపుర నిర్మాణ సంస్థ యజమాని సుధాకర్ రెడ్డిని, బిఆర్ఎస్ నాయకుడు మేకల వెంకటేశంను వదిలి పోలీస్ లు మా వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని బౌరంపేట వ్యవసాయ బాదిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బౌరంపేటలోని వ్యవసాయ భూమిలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బౌరంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 187,188,189 లో కంసమ్మ, కృష్ణారెడ్డి కుటుంబానికి 2 ఎకరాల 13 గు గుంటల తమ పూర్వికుల నుండి సంక్రమించిన వ్యవసాయ పొలం ఉందన్నారు.మా పొలాన్ని ఎవరికి అమ్మలేదన్నారు. త్రిపుర ల్యాండ్ మార్క్ యజమాని సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు మేకల వెంకటేశం మా పొలాన్ని అమ్మాలని గత ఏడేళ్లుగా వేదిస్తూన్నారని, కార్యాలయాల చుట్టూ తిరిగి తమ పొలంలోకి ఎవరు రావద్దంటు కోర్టు నుండి ఆర్డర్ తెచుకున్నామన్నారు. అవేమి పట్టించుకోని మేకల వెంకటేశం తదితరులు పొలం అమ్మలంటూ హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమవారిపై ఎస్సి,ఎస్టీ లాంటి అక్రమ కేసులు బనాయించారని,తమ వారికి రక్షణ కరువైయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు.  వ్యవసాయ భూమిలోకి వచ్చి పంట నాశనం చేయడమే కాకుండా ఎదురు తిరిగిన వాళ్లపై దాడులకు యత్నిస్తున్నారన్నారు.తరతరాలుగా తాతల నుండి సంక్రమించిన తమ భూమిపై మేకల వెంకటేశం త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థతో కలిసి కన్నేసారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల విషయంలో చొరవ చూపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలో త్రిపుర నిర్మాణ సంస్థ ఉద్యోగి ఫిర్యాదుతో బాదిత రైతులు సురేష్ రెడ్డి, మాధవ రెడ్డితో పాటు మరో 7 గురిపై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీస్ లు శుక్రవారం జైలుకు పంపినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking