కొండపైన పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం

కొండపైన పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం

గుట్ట ప్రాంత వాసులకు స్వామివారి

అంతరాలయ దర్శనాలు

యాదగిరిగుట్ట దేవస్థానంలో

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కరరావు
యాదగిరిగుట్ట, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను యాదగిరిగుట్ట దేవస్థానంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. దేవస్థానం ఈవో భాస్కరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతల అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యోగులకు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కరరావు విలేకరులతో మాట్లాడారు . యాదగిరిగుట్ట దేవస్థానంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించామని ఆయన తెలిపారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తున్నామని అన్నారు.

ఇప్పటికే కొండపైన ఉన్న వ్యాపారస్తులు అటు ఇటు తిరుగుతూ చిరు వ్యాపారాలు కొనసాగించే వారికి అందరిని పిలిపించి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని ప్లాస్టిక్ వస్తువులు అమ్మకుండా జాగ్రత్త వహించాలని సూచించామని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు అమ్మితేనే భక్తులు కొంటారని వాటిని వ్యాపారులు అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరి కొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తామని ప్లాస్టిక్ వస్తువులను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


అదేవిధంగా యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నామని ప్రస్తుతం ఈ భక్తుల సంఖ్య 600 వరకు ఉందని ఈ సంఖ్యను 600 నుండి 1000 మంది భక్తులకు ప్రతిరోజు అన్నదానం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్థానిక ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  సూచన మేరకు గుట్ట దేవస్థానంలో భక్తులు రాత్రి నిద్ర చేసేందుకు సౌకర్యాలు కల్పించామని అన్నారు మరింత ఎక్కువ మంది నిద్ర చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అదేవిధంగా భక్తులకు ఎండ వర్షం నుంచి రక్షణ కల్పించేందుకు గతంలో తాత్కాలిక షెడ్లు వేశామని అవి గాలి దుమారానికి కూలిపోవడం ఇతర విధాలుగా నష్టం జరగడం వల్ల ప్రస్తుతం శాశ్వతంగా ఉండే పూర్తిస్థాయి షెడ్లను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులకు తగిన విధంగా ఎండ వర్షం నుంచి రక్షణ కల్పించే విధంగా పూర్తిస్థాయిలో శాశ్వతంగా ఉండే విధంగా షెడ్లు ఏర్పాటు చేశామని మరిన్ని షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
అదేవిధంగా ఆలయంలోపల స్వామివారి పూజలు స్వామి వారి నిత్య కళ్యాణం బయట ఉన్న భక్తులు తిలకించే విధంగా ఆలయం బయట ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి లైవ్ ఇస్తున్నామని తెలిపారు . స్వామివారికి ప్రతిరోజు జరిగే పూజలు నిత్య కైంకర్యా వివరాలను ఈ ఎల్ ఈ డి స్క్రీన్ లపై ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తూ భక్తులకు సమాచారాన్ని చేరవేస్తున్నామని అన్నారు. యాదగిరిగుట్ట చుట్టుపక్కల హైదరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కళాకారులు నృత్యం ఇతర సంగీత పరమైన కలలు నేర్చుకుంటున్నారని వారికి దేవస్థానంలో అరంగేట్రం ఇవ్వాలనే కోరిక ఉంటుందని అన్నారు ఇందుకోసం యాదగిరిగుట్టలో శాశ్వతంగా ఒక కళా వేదికను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు బ్రహ్మోత్సవాలు స్వామివారి జయంతి ఉత్సవాలకే కాకుండా ప్రతి శుక్ర శని ఆదివారాలలో కళాకారులు తమ కళలను ప్రదర్శించే విధంగా అవకాశం కల్పిస్తున్నామని అన్నారు స్వామివారి సన్నిధిలో కళలను ప్రదర్శించే కళాకారులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి స్వామివారి ప్రసాదాలు అందజేస్తామని అన్నారు .
జూన్ 4వ తేదీ నుండి యాదగిరిగుట్ట ప్రాంతవాసులు తమ ఆధార్ కార్డు చూపిస్తే ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత స్వామివారి అంతరాలయ దర్శనం కల్పిస్తామని అన్నారు. స్థానికులకు గతంలో శనివారం ఉచిత దర్శనం కల్పించామని ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని స్థానికులు అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించిన మేరకు తిరిగి స్థానికులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రధానంగా అంతరాలయ దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమం జూన్ 4వ తేదీ మంగళవారం నుండి ప్రారంభిస్తామని అన్నారు ప్రాంతవాసులు ఈ గడ్డపై పుట్టిన వారు స్వామివారిని దగ్గరగా దర్శించుకోవాలని కోరిక ఉంటుందని అందుకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సాంప్రదాయ దుస్తులతో స్వామివారి దర్శనానికి రావాలని ఆయన అన్నారు సంప్రదాయ దుస్తులతో దర్శనం చేసుకోవాలని తమ నిబంధన విధించాక భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు తాము ఇంతకాలం చెప్పకపోవడం వల్లే భక్తులు వివిధ రకాల దుస్తులతో వచ్చారని తాము సాంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా వాడాలని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే వస్తున్నారని అన్నారు ఇదేవిధంగా మునుముందు కూడా ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా ఆలయ సాంప్రదాయాలను కాపాడే విధంగా సాంప్రదాయ దుస్తులతో స్వామివారి దర్శనానికి రావాలని ఆయన కోరారు కొండపైకి ఉచితంగా బస్సు నడిపిస్తున్నామని ఈ సౌకర్యం భక్తులకు మంచి అవకాశం అని అన్నారు గుట్టకు వచ్చే భక్తులలో 65 శాతానికి పైగా మహిళ భక్తులే ఉన్నారని అన్నారు కొండపైకి వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు కొండపైన ఒకేసారి 1000 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా అవకాశం ఉందని అన్నారు కొండపైన వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో కొండ కిందనే తమ వాహనాలను పార్కు చేసుకుంటే అక్కడి నుండే ఉచిత బస్సును కొండపైకి వచ్చే విధంగా సౌకర్యం కల్పిస్తామని ఎందుకు భక్తులు సహకరించాలని అన్నారు గత కొన్ని వారాలుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున పార్కింగ్ సమస్య తలెత్తుతుందని దీని పరిష్కరించేందుకు తగిన చర్యలు పరిష్కార మార్గాలు చేపడుతున్నామని అన్నారు. భక్తులు ఆలయ ప్రతిష్టను సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking