పదేళ్లలో… ప్రగతి పథంలో…
విల్లాలపై క్రేజ్
ఖర్చుకు వెనుకాడట్లే !
ప్లాట్ల కంటే విల్లాలపై మోజు
పెట్టుబడులకు మణిహారం హైదరాబాద్
స్థిరాస్తి రంగం… పదేళ్లలో… ఎంతో ప్రగతి పథంలో పయనించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే స్థిరాస్తి వ్యాపారం హైదారాబాద్ లో మసక బారుతుందనే ప్రచారం పటా పంచలైంది. కొత్తగా 2014 జూన్ 2 నుంచి రూపుదిద్దుకుంది. పదేళ్ళ ప్రస్థానం ఎన్నో మైలురాళ్ళను దాటుకుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇళ్లు… కార్యాలయాల సముదాయాలు, వాణిజ్య రంగాల్లోనూ దేశంలోని అగ్రశ్రేణి నగరాలను తలదన్నే ప్రగతిని సాధించింది. లక్షలాది మందికి ఈ పదేళ్ళలోసొంతింటి కలను సాకారం చేసింది. ఎంతో మంది యువతీ యువకుల ఉపాధికి ఉజ్వల భవిష్యత్తును అందించింది. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టిన ఎంతో మంది ఆర్ధిక వృద్ధి చెందారు. రోజు రోజుకు విస్తరిస్తూ అవుటర్ రింగ్ రోడ్డును దాటుకొని ప్రాంతీయ వలయ రహదారి వైపు పరుగులు తీస్తుంది. సిటీలో గరిష్టంగా 60 అంతస్తుల ఎత్తు భవనాల వరకు నిర్మాణ రంగం ఎదిగింది. ఐటి కారిడార్ లోనే కాదు… ప్రధాన ప్రాంతాల్లోనూ చుక్కలను తాకేలా తలపించే భవంతులు నిర్మితమయ్యాయి.
*హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :*
ఏకాంతం… ఉల్లాసం… విలాసంగా గడిపేందుకు ఫ్లాట్ల కంటే విల్లాలు మేలు. సొంతిల్లు… స్థిరాస్థి కొనుగోలుదారుల్లో ఇదే ఆలోచన రేకెత్తిస్తుంది. ప్రవాస భారతీయులు కూడా విల్లాలు కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కరోనా తదుపరి అందరిలో వ్యక్తిగత జీవితానికి జ్ఞానోదయం కల్గింది. అందరిలో ఉండే కంటే… ఏకాంతంగా… ఆహ్లాదకరంగా… పూదోట వంటి గ్రీనరీని కల్గిన మానసిక ఉల్లాసాన్ని తలపించే హరిత వాతావరణంపై దృష్టి మళ్లింది. ఉన్నదాంట్లో కాసింత ప్రశాంతంగా.. ఏకాంతంగా ఉండేందుకు విల్లాలను ఎంచుకుంటుండ్రు. దీంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. ప్రధాన నగరంలో శబ్ద కాలుష్యం…. వాయు కాలుష్యాలకు దూరంగా ఫాం హౌజ్ లను తలదన్నే విల్లాలను కొనుగోలు చేస్తుండ్రు. నగర శివారు ప్రాంతాల్లో సకల సదుపాయాలు, ప్రపంచ స్థాయి వసతులతో కూడిన విల్లాల జోరు నగరం నలుమూలలా పెరిగింది. దేశ వ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్ తో పోల్చితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ప్రతిష్ట రోజురోజుకు మరింత ప్రతిష్టాత్మకమవుతుంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు తోడు సమీప రాష్ట్రాల ప్రజలు సైతం హైదరాబాద్ లో స్థిర నివాసం ఓ బ్రాండింగ్ గా ఎంచుకుంటుండ్రు.అందుకు హైదరాబాద్ రియల్ రంగం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ విల్లసిల్లుతుంది. సకల సదుపాయాలు కల్గిన హైదరాబాద్ అందరిని మంత్ర ముగ్గులను చేస్తుంది. అడ్డమీద కూలి నుంచి అత్యంత కోటీశ్వరల స్థాయి వరకు వారి వారి స్థాయికి తగినట్లుగా హైదరాబాద్ స్థిరనివాసాలపై పెట్టుబడులు పెడుతుండ్రు. అన్ని వ్యాపారాల కంటే స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడి కళ్లెదుటే త్వరితగతిన పురోగతి సాధిస్తుండడంతో ఆయా వర్గాలు పెట్టుబడులు పెట్టేస్తుండ్రు, చిన్న చిన్న ఇళ్ళ నుంచి అఫార్ట్ మెంట్లు, గెటేడ్ కమ్యూనిటీలపై పెట్టుబడులు పెడుతూనే కాసింత ఉన్నతంగా ఉన్నోళ్లు లగ్జరీ విల్లాలపై దృష్టి సారిస్తుండ్రు.
ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా లగ్జరీ విల్లాలను కొనుగోలు చేస్తుండ్రు. కరోనా నేర్పిన ఏకాంత సంస్కృతి ప్రస్తుతం మరింత వేగంగా పరుగు లెత్తిస్తుంది.పెట్టుబడిదారుల ఆలోచనలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగరం శివారు ప్రాంతాల్లో విల్లాల విక్రయాలపై దృష్టి పెట్టారు. నగరం నలువైపులా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలోని అన్ని ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలకు మంచి డిమాండ్ పెరిగింది. నగర శివార్లల్లో తూర్పు, పశ్చిమ దిశలో ఆకర్షణీయమైన వెంచర్లు వెలిసాయి. ఆయా విల్లా సైట్లలో కొనుగోలు దారులను ఆకర్షించేందుకు ఆపర్ల పేరిట, వివిధ పద్దతులు, ప్రపంచస్థాయి సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాలతో కూడిన విల్లాలను అందుబాటులోకి తెచ్చే పనిలో నిమగ్న మయ్యారు. పశ్చిమ దిశలో కోకాపేట, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలకు తోడు తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని ఉప్పల్, ఎల్బీనగర్, ఆదిభట్ల, కొంపల్లి, శామీర్ పేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గౌరెల్లి, బాచారం తదితర ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనపర్చుతున్నారు.
దీంతో ప్రధాన నగరంలో కార్యాలయాలకు, సెలవు దినాల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా సౌకర్యవంతంగా… సౌలభ్య వంతంగా ఉండేలా ఆలోచిస్తున్నారు. అందుకు ఆయా ఏరియాల్లో డిమాoడ్ మరింత పెరుగుతుంది. ఆకాశానికి తాకేలా అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నప్పటికి కొనుగోళ్లు సజావుగానే సాగుతున్నాయి. సుధూర ప్రాంతంలో ఉన్నప్పటికి ప్రధాన నగారానికి కనెక్టివిటి… అనుసంధాన మయ్యేలా ఉంటే చాలు భలే గిరాకి. ఇక ఆయా విల్లాలు, అపార్ట్మెంట్లలో మెరుగైన రహదారులు, తాగునీరు, మురుగు కాల్వలు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలు ఉట్టిపడేలా కల్పిస్తుండడంతో అదే స్థాయి ధరలుండడం సహజమే. హెచ్ఎండిఏ పరిధిలో విక్రయాలను వరిశీలిస్తే… డిసెంబర్ 2023లో 13,194 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా 16,528 మంది విల్లాలు, 25,438 మంది ఒపెన్ ప్లాట్లు మొత్తంగా 55,160 మంది కొనుగోలు చేయగా రూ. 918 కోట్ల ఆదాయం లభించింది. జనవరి 2024లో 10,655 మంది ప్లాట్లు, 15,733 మంది విల్లాలు, 21,583 మంది ఒపెన్ ప్లాట్లు మొత్తంగా 47,971 మంది కొనుగోలు చేయగా రూ.8.678 కోట్ల ఆదాయం, ఫిబ్రవరి 2024లో 13, 209 మంది ప్లాట్లు, 18,111 మంది విల్లాలు, 25,167 మంది ఓపెన్ ప్లాట్లు మొత్తంగా 54,599 మంది కొనుగోలు చేయగా రూ. 920 కోట్ల ఆదాయం, మార్చి 2024లో 13,199 మంది ఫ్లాట్లు, 17,913 మంది విల్లాలు, 23,487 ఒపెన్ ప్లాట్లు మొత్తంగా 54,599 మంది కొనుగోలు చేయగా రూ.890 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్, నల్గొండ-ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు, ఎన్నికల కోడ్ కారణంగా కాసింత మందగించినప్పటికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రేజ్ ఎప్పటికి తారాస్థాయిలోనే ఉంటుంది. పదేళ్లుగా హైదరాబాద్ రియల్ రంగం జోరుగానే ఉంది. అదే తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ రంగానికి అదేస్థాయిలో పెద్దపీట వేయనుంది. ఇప్పటికే సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సైతం రియల్ రంగానికి భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ గా, కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీ తాను కట్టానని… తనకు అపార అనుభవం ఉందని… తన పురోగతి రియల్ ఎస్టేట్ తోనేనని వెల్లడించిన విషయం విధితమే. రియల్ ఎస్టేట్ రంగాన్ని పతాక స్థాయిలోనే ఉంచగలనని భరోసా కల్పించారు. ఎన్నికల కోడ్, తెలంగాణ ఆవిర్బావ పదేళ్ల పండుగను ముగించుకుని జూన్ 4 ఓట్ల లెక్కింపు తదుపరి రియల్ ఎస్టేట్ మరింత పుంజుకోనుంది. ఇప్పటికే పేరెన్నిక కల్గిన రియల్ సంస్థలు నగరం నలుమూలల కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి అపార్ట్ మెంట్లు, గెటేడ్ కమ్యూనిటీ, విల్లాలు అందుబాటులోకి తెచ్చారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు ఆనుకొని వాసవీ ఆనంద నిలయం పేరుతో 29.37 ఎకరాల్లో 3576 యూనిట్లలో ॥ టవర్లలో 33 అంతస్థుల భవంతులు, 112 స్కై విల్లాలను రియల్ రంగంలో అగ్రగామిగా పేరొందిన వాసవీ గ్రూప్ నిర్మిస్తుంది. అదేవిధంగా నాగోల్ నుంచి ఔటర్ రింగురోడ్డు వెళ్లే దారిలో
గౌరెల్లిలో రాజా ఇన్ ఫ్రా డెవలఫర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మలా ట్రాన్స్ క్విల్ విల్లా ప్రీమియం ప్రాజెక్టును చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో 8.4 ఎకరాల్లో 110 విల లు, 175-234 గజాల్లో 2975, 3978 చ.అ. విస్తీర్ణంలో సువిశాలమైన విల్లాలను అందుబాటుల్లోకి తెచ్చారు. మునుపెన్నడు లేనివిధంగా విల్లామెట్స్, 20 వేల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ లను నిర్మిస్తున్నట్లు రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు తెలిపారు. గౌరెల్లి నుంచి వలిగొండ హైవే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఇప్పటికే ఆరంభించింది. దీంతో రియల్ రంగం మరింత వేగంగా దూసుకెళ్లనుంది. హైదరాబాద్ లో విల్లాల క్రేజీని తలపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.