టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్ సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం/ అక్షిత బ్యూరో : టియుడబ్ల్యుజే (ఐ జేయు) రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా రూపొందించిన వెబ్సైట్ ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గృహ నిర్మాణ రెవిన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.ఈనెల 18 , 19.20 వ తేదీల్లో టి యు డబ్ల్యూ జే- ఐ జేయు రాష్ట్ర మూడవ మహాసభలు ఖమ్మంలో అట్టహాసంగా జరగనున్నాయి.ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించగా ఆ వెబ్సైట్ ని శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మహాసభల సందర్భంగా వివిధ మాధ్యమాల్లో సభల విజయవంతానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జర్నలిస్టు మహాసభల ను పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గస్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఒక సెమినార్ నిర్వహించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు.ఆయా కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు.ఈ వెబ్సైట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో టియుడబ్ల్యూజే -ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ టియుడబ్ల్యు జె ఐజేయు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు, ఖదీర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్ సామినేని మురారి, జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు కనకం సైదులు, జిల్లా నాయకులు నల్లజాల వెంకటరావు భూపాల్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎస్.కె మొహిద్దిన్ నామ పురుషోత్తం జనార్ధన చారి తాళ్లూరి మురళీకృష్ణ మేడి రమేష్, ఆనంద్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.