మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేందిర బోయి

మహబూబ్ నగర్  జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. విజయేందిర బోయి

▪️కలెక్టర్ కు స్వాగతం పలికిన రెవెన్యూ
అదనపు కలెక్టర్ లు, పలు శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా బి. విజయేందిర బోయి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

తొలుత జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు ఆర్.బి.అతిథి గృహం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్
మోహన్ రావు, అదనపు ఎస్.పి.రాములు, ఆర్ డిఓ నవీన్  స్వాగతం పలికారు.

అనంతరం నేరుగా జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఛాంబర్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎస్.మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కృష్ణ, డిపిఆర్ ఓ శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ డిడి.పాండు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శంకర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఏ.నటరాజ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలెక్టర్ కు పూల బొకేలు అందించి సాదరంగా కలిశారు.

అనంతరం తహశీల్దార్ లతో టెలీ కాన్పరిన్స్ నిర్వహించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు, సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking