సహనానికి ప్రతీక .. బక్రీద్

ముస్లిం సోదరసోదరీమణులకు
బక్రీద్ శుభాకాంక్షలు 

నల్లమోతు సిద్దార్థ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి, సహనానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. త్యాగ గుణాన్ని గౌరవించేందుకు, వీరత్వం నుంచి స్ఫూర్తి పొందేందుకు జరుపుకునే బక్రీద్ పండుగ మానవాళిలో ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని నింపాలని సిద్దార్ధ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking