భక్తికి, త్యాగానికి, సహనానికి ప్రతీక ‘బక్రీద్’
* ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
* మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
భక్తికి, త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ ప్రతీక అని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని సూచించారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని చెప్పారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు.