కష్టపడి చదివితేనే… ఉజ్వల భవిష్యత్

*విద్యార్థినిలు కష్టపడి చదవాలి
*తాము ఎంచుకున్న వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి*
*కస్తూరిబా బాలికా విద్యాలయం(మైనార్టీ) సందర్శించిన జిల్లా కలెక్టర్ బి.విజయేందిర*

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :
విద్యార్థినిలు కష్టపడి చదవాలని, కష్టపడి చదివితేనే ఉన్నత విద్య నభ్యసించి ఆసక్తి ఉన్న రంగంలో జీవితంలో స్తిరపడతారని జిల్లా కలెక్టర్ బి.విజయేందిర అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం యెనుగొండలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం(మైనార్టీ బాలికలు), కె.జి.బి.వి. మహబూబ్ నగర్ అర్బన్ జూనియర్ కళాశాల ను జిల్లా కలెక్టర్ బి.విజయేందిర ఆదివారం సందర్శించారు.

జిల్లా కలెక్టర్ కె.జి.బి.వి మహబూబ్ నగర్ అర్బన్ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో విద్యార్థినిలు సంఖ్య,ప్రస్తుతం అడ్మిషన్ ల గురించి,పరీక్షలలో ఫలితాలు గురించి స్పెషల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు.మొదటి, రెండవ సంవత్సరం కలిపి 160 సీట్లకు గాను 80 మంది ఉన్నారని,మొదటి సంవత్సరం లో అడ్మిషన్ లు జరుగుతున్నట్లు తెలిపారు. కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న ఎం.పి.సి.,బై.పి. సి తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో జిల్లా కలెక్టర్ సంభాషించారు.

మొదటి సంవత్సరంలో సాధించిన మార్కులు,విద్యార్థినీలు తాము భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారని అడిగారు. పలువురు విద్యార్థినిలు ఐ. ఏ.ఎస్.,ఐ.పి.ఎస్.,బ్యాంకింగ్,సాప్ట్ వేర్,లెక్చరర్ తదితర ఉద్యోగాల్లో స్థిరపడాలని చదువుతున్నట్లు తెలిపారు. కష్టపడి చదివితేనే తాము ఎంపిక చేసుకున్న వృత్తి,ఉద్యోగంలో బాగా స్థిర పడ వచ్చని,జీవితంలో ఎవ్వరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని అన్నారు.

చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ ఆత్మ రక్షణ,కంప్యూటర్ బేసిక్స్,టైపింగ్,డ్రైవింగ్ లాంటి నైపుణ్యాలు కలిగి ఉండాలని అన్నారు. తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, బలవర్థకమైన పోషక ఆహారం తీసుకోవాలని అన్నారు.కళాశాల ఆవరణలో విద్యార్థినిలు ఆటలు ఆడుకునే విధంగా పరిశుభ్రం చేయాలని అన్నారు. పక్కనే ఉన్న కె.జి.బి. వి (మైనార్టీ బాలికలు) ను సందర్శించి 10 వ తరగతి విద్యార్థినిలతో మాట్లాడారు. బాగా చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని కోరారు.అనంతరం వంట గదిని పరిశీలించి ఆహారం మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్,కె. జి.బి.వి స్పెషల్ ఆఫీసర్ శంకరమ్మ, అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking