రైతులకు అందుబాటులో ఎరువులు విత్తనాలు
పిఎసిఎస్ చైర్మన్ జడ రాములుయాదవ్
వేములపల్లి అక్షితన్యూస్:
ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అందుబాటులో ఉన్నట్లు పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ విత్తనాలు చిట్టీ పొట్టి రకం 10 కిలోలు , అంకుర్ పద్మ 10 కిలోలు, అంకుర్ 101 10 కిలోలు, కల్కి 369 10 కిలోలు,కలెక్టర్ 10 కిలోలు,ఎంటియు 1010 25 కేజీల ధర రూ.987.50,కే ఎన్ ఎం 118 25 కేజీలు ధర 987.50, ఎరువులు యూరియా 50 కేజీలకు ధర రూ.266.50, డిఎపి 50 కేజీలకు ధర రూ.1350, 20:20:013: 50 కేజీల ధర రూ 1150, అందుబాటులో ఉన్నట్లుతెలిపారు. అవసరమైన రైతులు తమ వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపిలను తీసుకొని రావాలన్నారు.