వర్తక వ్యాపార సంఘం అధ్యక్షునిగా కన్నేకంటి*

*వర్తక వ్యాపార సంఘం అధ్యక్షునిగా కన్నేకంటి*

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

రామన్నపేట పట్టణంలో గల స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమస్త వర్తక వ్యాపారుల సమావేశంలో పట్టణానికి చెందిన వివిధ వ్యాపారస్తులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రామన్నపేట పట్టణ సమస్త వ్యాపార సంఘం అధ్యక్షునిగా కన్నెకంటి వెంకటేశ్వరచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా సభ్యులు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఎంఏ వాహిద్, ఉపాధ్యక్షులుగా వనం బిక్షం, తమ్మిశెట్టి సందీప్, కోశాధికారిగా కల్లూరి నాగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా ఎన్నికైన కన్నకంటి వెంకటేశ్వరచారి మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయడమే కాక వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking