పేదరికంలో జన్మించిన సరిత ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక
చేర్యాల,జూన్ 26 అక్షిత ప్రతినిధి: నిరుపేద కుటుంబంలో జన్మించి తల్లిదండ్రుల, భర్త సహకారంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచిన సరిత గౌడ్, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బందారం సరిత గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీలోనే కెమిస్ట్రీ విభాగంలో పిహెచ్ డి చేస్తూనే, సరిత 2024లో వెలువడిన నోటిఫికేషన్‌లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ ఉద్యోగాం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన విజయం వెనుక తన భర్త డాక్టర్”బందారం వెంకటేశ్వర్లు గౌడ్, మరియు నా యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనన్నారు. ఈ మేరకు పూర్తి సహకారం అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లు కూతటి భాస్కర్, డాక్టర్ పి.మురళీధర్ రెడ్డి లు ఎంతో ప్రోత్సహించడం తోపాటు సలహాలు, సూచనలు అందించారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన సరిత- వెంకటేశ్వర్లను పలువురు గ్రామస్తులు అభినందించారు.